18
2.అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే ‘కుంచెకోల’ అనే సాధనం, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు. వారు క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి, బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు. ఆ సమయానికి ఆలయ అధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు, తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడేందుకు సిద్ధంగా ఉంటారు.