1
ఒకవైపు కలెక్టర్, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ… వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇంకోవైపు డీఆర్వో మలోల తాపీగా తనకేం పట్టనట్లుగా సెల్ ఫోన్ లో రమ్మీ ఆడుతూ కనిపించారు. హాల్లో జరుగుతున్న సమావేశం హాల్లో వందల మంది ప్రజలు, కలెక్టర్లు, ఎస్పీ, అధికారులు, మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నా…డీఆర్వో తనపనిలో తాను మునిగిపోయారు. డీఆర్వో రమ్మీ ఆడుతున్న దృశ్యాలు మీడియా కంటికి చిక్కడంతో…వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వరకు వెళ్లింది. ఈ ఘటనపై కలెక్టర్ విచారణ చేపట్టారు. ఈ ఘటనపై వివరణ డీఆర్వో మల్లోలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.