Friday, March 13, 2026
Home » కుంభమేళాలో బాలయ్య షూటింగ్‌ షురూ.. ఆ చిత్రం సీక్వెల్‌ ప్రారంభం – News Watch

కుంభమేళాలో బాలయ్య షూటింగ్‌ షురూ.. ఆ చిత్రం సీక్వెల్‌ ప్రారంభం – News Watch

by News Watch
0 comment
కుంభమేళాలో బాలయ్య షూటింగ్‌ షురూ.. ఆ చిత్రం సీక్వెల్‌ ప్రారంభం


ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయోగ్‌ రాజ్‌లో అతిపెద్ద హిందూ పండగ మహా కుంభమేళా సోమవారం నుంచి కనిపిస్తుంది. సోమవారం పుణ్య స్నానాలను ఆచరించడం ద్వారా ఈ కుంభ మేళా కనిపిస్తుంది. సోమవారం నుంచి 40 రోజులపాటు జరగనున్న కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. తొలిరోజే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులతో ప్రయోగ్‌ రాజ్‌ కిక్కిరిసింది. ఎక్కడ చూసినా లక్షలాది మంది భక్తులు కనిపించారు. అటువంటి కుంభమేళాలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ కెపాసిటినీ, నట విశ్వాన్ని తెలుగు సినీ అభిమానులకు మరోసారి చూపించినట్లు అయింది.

అటువంటి అఖండ చిత్రం సీక్వెల్‌గా పార్ట్‌-2 రాబోతోంది. అఖండ్‌-2 చిత్రం షూటింగ్‌ ప్రయోగ్‌ రాజ్‌లో సోమవారం ప్రారంభమైన కుంభమేళాలో కనిపిస్తుంది. భోయపాటి శ్రీను డైరక్టర్‌గా ఈ చిత్రం షూటింగ్‌ కుంభమేళాలో ఉంది. మూవీ యూనిట్‌ చాలా కీలకమైన సన్నివేశాలను మహా కుంభమేళాలో చిత్రీకరిస్తోంది. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. పార్ట్‌-1 అద్భుత విజయాన్ని సాధించడంతో పార్ట్‌-2పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి శ్రీను అండ్‌-2ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రం మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్‌ థమన్‌ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్‌ సి రాంప్రసాద్‌, ఎడిటర్‌ తమ్మిరాజు, ఆర్ట్‌ డైరక్టర్‌ ఎస్‌ఎస్‌ ప్రకాష్‌తో సహా అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 25న దసరా కానుకగా సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అందుకు అనుగుణంగానే దర్శకుడు సినిమాకు హైప్ ఇచ్చేలా కుంభమేళాలో చిత్రీకరణ ప్రారంభించడంతో సినిమా పట్ల ఆసక్తి పెరిగింది.

ప్రధాని మోడీ యూట్యూబ్ సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. నెలవారీ సంపాదన ఇదే.!
జుట్టు ఒత్తుగా, పొడవు పెరగాలంటే 8 యోగాసనాలు చేయండి చాలు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch