Tuesday, February 24, 2026
Home » వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్.. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ పోస్ట్ చేశారు – Sravya News

వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్.. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ పోస్ట్ చేశారు – Sravya News

by News Watch
0 comment
వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్.. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ పోస్ట్ చేశారు


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. దేశంలో నిర్వహించే ఈవీఎంలకు బదులు పరీక్ష బ్యాలెట్లు వినియోగించేలా జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ఏవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు మాత్రమే వాడుతున్నారు, భారత్‌లోనూ బ్యాలెట్లు వాడాలని జగన్. న్యాయం జరగడమే కాకుండా.. న్యాయం జరిగినట్లు కనిపించాలని ఈ సందర్భంగా జగన్ సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్లలో సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ఈవీఎంలు ట్యాంపరింగ్ విషయంపై, దేశంలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది.

ఎన్నికల ఫలితాలు అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. ఏదో జరిగింది, అది దేవుడు మాత్రమే తెలియాలని సూచించాడు. ఆ తరువాత ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ చేయడంతో ఆసక్తి కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఈవీఎంలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పై అధికార తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేదు అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ ఇంకా షాక్ నుంచి ఇంకా బయటకు రాలేదని, ఆంధ్ర ఎలాన్ మాస్క్ మాదిరిగా మాట్లాడాలని ఎద్దేవా చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch