Tuesday, February 24, 2026
Home » పథకాల పేర్లపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – Sravya News

పథకాల పేర్లపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – Sravya News

by News Watch
0 comment
పథకాల పేర్లపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు


ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పాలనలో జోరు పెంచింది. ముఖ్యంగా పథకాల అమలు, పేర్లు కొనసాగింపుకు సంబంధించి కీలకమైన వాటిని మంగళవారం జారీ చేసింది. 2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి పాత పేర్లను పెట్టాలని అన్ని శాఖలను ఆదేశించింది. 2019 – 24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పేర్లు లేకుండానే పథకాలను కొనసాగించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పాసుపుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు సర్టిఫికెట్లు జారీని వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తాజా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన పేర్లే. ఆ పేర్లను ప్రస్తుతం మారనున్నాయి. ఆయా పథకాలను కొనసాగించాలో, మార్పులు చేయాలో అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అనంతరం వాటికి పేర్లు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అందుకు అనుగుణంగా అనేక పథకాలను చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయా పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు, వాటికి ఎటువంటి పేర్లు పెట్టాలి, ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విధి విధానాలు ఖరారుపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరిగిన పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఇప్పటికే నాలుగు వేలకు పెంచారు. పెరిగిన పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసిన ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వంలో ఎంపికైన వాలంటీర్లను కొనసాగిస్తారా..? వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేస్తారా అన్నదానిపై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch