11
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాలో ఎల్‌బినగర్‌కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులు సీపీఆర్ చేసి బాలుడిని కాపాడారు. అల్లు అర్జున్ రాక గురించి ముందస్తు సమాచారం ఇవ్వలేదు ఈ ఘటన చోటుచేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.