Thursday, February 19, 2026
Home » బిజెపి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు గ్రీన్ సిగ్నల్.! – News Watch

బిజెపి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు గ్రీన్ సిగ్నల్.! – News Watch

by News Watch
0 comment
బిజెపి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు గ్రీన్ సిగ్నల్.!


బిజెపి రాజ్యసభకు అభ్యర్థులను ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా మూడు చోట్ల బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను తాజాగా ప్రకటించారు. ఇందులో ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాల్లో ఒకటి బిజెపికి దక్కింది. ఈ అంశాల ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు బిజెపి అధిష్టానం కేటాయించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన బిజెపి అధిష్టానం, హర్యానా నుంచి రేఖ శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేతగా పేరుగాంచిన ఆర్ కృష్ణయ్యకు గతంలో వైసిపి రాజ్యసభ కేటాయించి పెద్దల సభకు పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాభవాన్ని చవిచూడడంతో ఆర్ కృష్ణయ్య రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన అదే స్థానం నుంచి మళ్లీ ఎన్నిక అయ్యేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగించారు. గడిచిన కొన్నాళ్ల నుంచి బిజెపి అగ్ర నాయకులతో టచ్‌లో ఉన్నారు. చర్చలు ఫలించడంతో బీజేపీ అగ్రనాయకత్వం ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాల్లో ఒక ఆర్.కృష్ణయ్యత్వాన్ని అభ్యర్థిత్వం ఖరారు చేసింది.

రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్‌కు తుది గడువు మంగళవారంతో ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే బిజెపి అధి త్వం సోమవారం ఏపీతోపాటు మిగిలిన రాష్ట్రాలకు దక్కిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఏపీ తరపున ఖాళీ అయిన మూడు కూటమికి రేపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బిజెపి తరపున ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు. బిజెపి అగ్రనాయకత్వం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్ కృష్ణయ్య, వేద మస్తాన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మూడో అభ్యర్థిత్వాన్ని ఇంకా కూటమి ఖరారు చేయలేదు. ఈ స్థానం కోసం టిడిపిలో తీవ్రమైన పోటీ. పలువురు నేతలు ఈ స్థానాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సానా సతీష్, కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీపీ జనార్ధన్ వంటి నేతలు ఈ కోసం ఆశిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో టిడిపి అధిష్టానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాదులోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి పెద్ద ఎత్తున ఆశావహులు క్యూ కడుతున్నారు. టిడిపి అగ్ర నాయకత్వం కూడా సోమవారం సాయంత్రం మూడో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.

17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
జుట్టు పెరగడానికి చిట్కాలు | జుట్టుకు ఈ ఫుడ్స్ మీ ఆహారంలో పెరగనివ్వండి

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch