15

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. సూపర్- 6 పథకాల అమలుతో పాటు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటిన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.ఈ సమావేశంలో వాగ్దానాల అమలు, రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. ఎనిమిది శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.