Thursday, February 26, 2026
Home » రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు – Sravya News

రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు – Sravya News

by News Watch
0 comment
రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు


ఎండ తీవ్రత ఉక్కపోతతో విలవిల్లాడుతున్న ప్రజలతోపాటు వర్షాల కోసం రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా చతీష్ ఘడ్ పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు రాష్ట్ర అంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఓ మో వర్షాలు, మంగళ, బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసేలా ఉన్నాయి. అవకాశం ఉంది. ఆదివారం తిరుపతి, అల్లూరు సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రైతాంగానికి చాలా మేలు చేకూరే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే వివిధ రకాల నాట్లు వేస్తున్న రైతులు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తారంగా కురవనున్న వర్షాల ప్రభావంతో రైతాంగం కొంత మేరకు ఉపశమనం పొందనుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch