Thursday, February 26, 2026
Home » పోలీసు దిగ్బంధం లో బాసర ట్రిపుల్ ఐటి … ఎబివిపి ముట్టడి పిలుపు ప్రభావం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పోలీసు దిగ్బంధం లో బాసర ట్రిపుల్ ఐటి … ఎబివిపి ముట్టడి పిలుపు ప్రభావం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
పోలీసు దిగ్బంధం లో బాసర ట్రిపుల్ ఐటి ... ఎబివిపి ముట్టడి పిలుపు ప్రభావం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి తో పాటు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఇతర ప్రాంతాలన్నీ పోలీసు దిబ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా పోలీస్ పహారా కనిపించింది. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలపై సెక్యూరిటీ సిబ్బంది చేసిన ఉదంతం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏబీవీపీ శాఖ ట్రిపుల్ ఐటీ ముట్టడికి పిలుపునిచ్చింది.

వివిధ ప్రాంతాల నుంచి బాసరకు రానున్న ఏబీవీపీ కార్యకర్తలను చేరుకోకుండా పోలీసులు బలగాలు మోహరించారు. వివిధ ప్రాంతాల నుంచి బాసరకు చేరుకున్న యువత ప్రశ్నలతో విసిగించి సంతృప్తి చెందాకే బయటకు అనుమతిస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు ఏబీవీపీ కార్యకర్తలు పోలీసుల కళ్లు కప్పి బాసర ట్రిపుల్ ఐటీ చేరుకుని గోడ పైనుండి లోపలికి దూకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ముట్టడిలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ ప్రాంతాల్లో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch