Wednesday, March 11, 2026
Home » తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. ఈ లడ్డూ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులు చేసిన సూచన మేరకు లడ్డూ కల్తీపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి డీజీపీ ఉంది. తదుపరి విచారణ అనంతరం సుప్రీం కోర్టుకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామన్నారు.

కాగా, గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నిజనిజాలు నిగ్గుతేల్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. రెండు రోజులుగా సీట్ అధికారులు బృందాలుగా ఏర్పడి లడ్డు కల్తీ ఫై విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ (అక్టోబరు 3) అనంతరం, అత్యున్నత న్యాయస్థానం నేపథ్యంలో సిట్ విచారణ మళ్లీ కొనసాగుతుందని డీజీపీ వివరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch