హైదరాబాద్‌లో వరుసగా మయోనైజ్ తిన్న వ్యక్తులు మరణించడం, తీవ్ర అనారోగ్యం పాలవడం కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ సింగాడి కుంటలో మోమోస్ తిని ఒక మహిళ చనిపోగా..మరో 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరందరూ ఆయే హోటళ్ళు, రోడ్డు పైడ్ ఫుడ్ స్టాల్స్‌లో ఇచ్చిన మయోనైజ్ తినడం వల్లనే చనిపోయారని డాక్టర్ రిపోర్ట్‌లలో తేలింది. దీనినే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మయోనైజ్‌ను నిషేధిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పాటూ రాష్ట్రంలో హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ తనిఖీలు జరగాలని సంబంధిత శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 3 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు, 5 మొబైల్’ సేఫ్టీ ల్యాబ్స్‌ని ఏర్పాటు చేసింది. కల్తీ ఆహారం తీసుకోవడంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ మధ్య జరిగిన సఘటనల నేపథ్యంలో …ఎన్నిసార్లు చెప్పినా హోటళ్ళు తమ తీరు మార్చుకోవడం లేదంటూ బల్దియా ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులో మయోనైజ్‌ను నిషేధించాలని కోరింది.