2
మహారాష్ట్ర ఎన్నికల వేళ కాంగ్రెస్‌కి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రవిరాజా గురువారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన బిజెపిలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘1980 నుంచి యూత్ కాంగ్రెస్ సభ్యునిగా ఎంతో చిత్తశుద్ధితో అంకిత భావంతో పార్టీకి సేవలందించాను. కాంగ్రెస్ పార్టీలో 44 ఏళ్లుగా సేవలు చేశాను.
అయితే పార్టీలో నాకు సరైన గౌరవం దక్కలేదు. అందుకే ఈరోజు పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నాను’ అని రవిరాజా ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. రవిరాజా గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతిపక్షనేతగా ఉన్నారు.కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ, మహాయుతి కూటముల మధ్యే పోటీ జరగనుంది.