1
దీపావళి పర్వదినం సందర్భంగా పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలకు సోమవారం ఆర్డీఓ భానుశ్రీ లక్కీడీప్ ద్వారా దుకాణ నెంబర్లను కేటాయించారు. 41 షాపులకు లక్కీడీప్ ద్వారా నెంబర్లను కేటాయించి ఆర్డీఓ లక్కీడీప్ తీశారు. ఈ లక్కీడీప్ లో ముందుగా మొదటి షాపును ఉదయ్ కుమార్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా దుకాణాలను ఏర్పాటు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.