Wednesday, October 30, 2024
Home » ఏడిద గ్రామంలో దీపావళి సామాగ్రి పేలుడు ఘటన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్..

ఏడిద గ్రామంలో దీపావళి సామాగ్రి పేలుడు ఘటన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్..

0 comment

రామచంద్రపురం డివిజన్ మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన దీపావళి సామాగ్రి పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెంది, మరొ ముగ్గురు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో వున్న మంత్రి సుభాష్ ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫోన్ లో అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కొల్లు వెంకట కృష్ణ కుటుంబాన్ని మంత్రి ఫోన్ ద్వారా పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా చెప్పారు. దీపావళి పండుగ ఒక కుటుంబంలో విషాదం నెలకొల్పడం చాలా బాధాకరం అన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని, దీపావళి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch