ద్రాక్షారామ టౌన్ ఆటో యూనియన్ అధ్యక్షునిగా బొమ్ము సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాల నుంచి ఈ ఆటో యూనియన్ కొనసాగుతూ ఉందని సరైన ఉపాధి లేక ఉన్నత చదువులు అభ్యసించి కూడా జీవనోపాధి కోసం ఆటో కార్మికులుగా పనిచేస్తున్నామని తెలిపారు. తమకు ఎటువంటి సమస్య వచ్చినా సానుకూలంగా స్పందించి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని పట్టణ అధ్యక్షునిగా ఎన్నుకున్నామని అన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ లో భాగమైన ఉచిత బస్సు ప్రయాణం ఆటో కార్మికుల ఉపాధికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందన్నారు. ఆటో కార్మికులందరికీ న్యాయం చేకూర్చే దిశగా తగిన నిర్ణయం తీసుకోవాలని కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగు ఆటో యూనియన్ సర్వ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ద్రాక్షారామ టౌన్ ఆటో యూనియన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొమ్ము సత్యనారాయణ..
1
previous post