Friday, March 27, 2026
Home » కాంగ్రెస్ నేత హత్యపై సీరియస్ గా ఉన్నాం – మంత్రి శ్రీధర్ బాబు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కాంగ్రెస్ నేత హత్యపై సీరియస్ గా ఉన్నాం – మంత్రి శ్రీధర్ బాబు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
కాంగ్రెస్ నేత హత్యపై సీరియస్ గా ఉన్నాం - మంత్రి శ్రీధర్ బాబు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • హతుడు గంగారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం
  • జీవన్ రెడ్డితో నేను మాట్లాడతా
  • ఆయన గౌరవాన్ని కాపాడుతాం

ముద్ర, తెలంగాణ బ్యూరో : జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గంగారెడ్డి హత్య ఘటనపై సీరియస్ గా వ్యవహారిస్తున్నట్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జగిత్యాల ఘటనకు సంబంధించిన వివరాలన్నీ చేరాయి. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపామన్నారు. దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు బుధవారం గాంధీభవన్ లో మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు.. హతుడు గంగారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గంగారెడ్డి హత్యపై విచారణ జరిపి, ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డీజీపీ, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. అత్యంత సన్నిహితుడిని కోల్పోవడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర విచారంలో ఉన్న పార్టీ దృష్టికి వచ్చింది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా లేదని, ఆయనతో తాను మాట్లాడిన పరిస్థితులను చక్కదిద్దుతానని అన్నారు. జీవన్ రెడ్డి గౌరవాన్ని కాపాడుతామన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch