Saturday, March 14, 2026
Home » జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం, కార్యకర్త హత్యతో హీటెక్కిన రాజకీయాలు-jagtial congressoperative murder political clash erupts between mlc jeevan reddy mla sanjay kumar ,తెలంగాణ న్యూస్ – Sravya News

జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం, కార్యకర్త హత్యతో హీటెక్కిన రాజకీయాలు-jagtial congressoperative murder political clash erupts between mlc jeevan reddy mla sanjay kumar ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం, కార్యకర్త హత్యతో హీటెక్కిన రాజకీయాలు-jagtial congressoperative murder political clash erupts between mlc jeevan reddy mla sanjay kumar ,తెలంగాణ న్యూస్


జీవన్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫైర్

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంగారెడ్డి హత్య బాధాకరమని..హత్యను జీవన్ రెడ్డి రాజకీయం చేసి ఖండిస్తున్నట్లు తెలిపారు. గంగారెడ్డి హత్యకేసులో తన పక్కనున్నవారితో నా హస్తం ఉందని జీవన్ రెడ్డి మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఫిరాయింపుల రాజకీయాల గురించి మాట్లాడుతున్న జీవన్ రెడ్డిది ఎలాంటి చరిత్రో అందరికీ తెలుసు. నాడు కాంగ్రెస్ ను తిడుతూనే రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర జీవన్ రెడ్డిదని. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రి అయి నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి మళ్లీ పార్టీ ఫిరాయించి ఎన్టీఆర్ ను ఏకాకిని చేసింది జీవన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచే మేం కాంగ్రెస్ వాదులు,.. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు కేంద్రబిందువు మా ఇల్లు అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని సంజయ్ స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch