కౌన్సిలింగ్ అవసరం
వరుస ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే అవగాహన సదస్సులు పెట్టాల్సిన అవసరం ఉందనే వాదన పోలీస్ శాఖలో వినిపిస్తోంది. పని ఒత్తిడి, అధికారులు, సిబ్బంది మధ్య కో ఆర్డినేషన్, ఆర్థిక ఇబ్బందులు, పర్యవేక్షణపై పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పై పలు సూచనలు ఇవ్వాల్సి ఉంది. ఆత్మహత్యలతో కావని ఎస్పీ రోహిత్ రాజు సమస్య పరిష్కారం అవుతున్నారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని పదే పదే సూచిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్లతో పాటు సిబ్బంది ఎప్పుడైనా తన వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నానని చెప్పారు. బూర్గంపాడు కానిస్టేబుల్ సాగర్ కుటుంబ సభ్యులు, ఆయన విజ్ఞప్తి మేరకు మానవతా దృక్పథంతో ఈ నెల 8న సస్పెన్షన్ వేటు వేటువేశామని, పోస్టింగ్ కూడా ఇచ్చామని తెలిపారు. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి వస్తే సమస్య పరిష్కారం అయ్యేదని చెప్పాలి. తొందర పాటు ప్రాణం పోగొట్టుకోవడం బాధగా ఉందని ఎస్పీ విచారం వ్యక్తం చేశారు.