24
ఏజెన్సీ నుంచి వచ్చే ప్రతి వాహనానికి ముందు, వెనుక ఎస్కార్ట్ వాహనాలతో రవాణా జరుగుతుందని, పోలీసుల తనిఖీలు ఉన్నా ముందుగానే స్మగ్లర్లను అప్రమత్తం చేసి వాటి నుంచి బయటపడే ప్రత్యేక వ్యవస్థలు గంజాయి సాగు ముఠాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గంజాయి సాగును , వినియోగం, విక్రయాలను సంపూర్ణంగా నిరోధించాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, దానిని క్షేత్ర స్థాయిలో అమలు చేసే అధికార యంత్రాంగానికి పూర్తి భరోసాతో పాటు రాజకీయ జోక్యం లేని స్వేచ్ఛ కూడా అవసరం.