6
దసరా పండుగ సమయంలో సామాన్యులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలోని అన్ని చౌక ధరల దుకాణాల్లో రేషన్‌కార్డుపై తక్కువ ధరకే వంట నూనెలు అందించనున్నట్లు వెల్లడించింది. దీంతో కిలో పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో వంటనూనెల అమ్మకంలో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని హెచ్చరించింది.