24
అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి:
- లాసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం ఎంపిక చేసుకున్న అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- TS LAWCET & PGLCET-2024 అడ్మిషన్స్ ఆప్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇక్కడ LLB 3 YDC ఆప్షన్ పై ఉంచితే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- హోమ్ పేజీలో కనిపించే తాత్కాలిక కేటాయింపు లాగిన్ దశ 2 పై నొక్కాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు ర్యాంకును ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ అలాట్ మెంట్ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్ పై కాపీని పొందాలి.
తెలంగాణ లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను సెప్టెంబరు 2న కేటాయించారు. కన్వీనర్ కోట కింద 3, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లు 6,324 ఉన్నాయి. వీటి కోసం 14,817 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసి పోటీపడ్డారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 3,901 మందికి ఎల్‌ఎల్‌ఎల్‌బీ సీట్లను కేటాయించారు. 1462 మందికి అయిదెళ్ల ఎల్‌ఎల్‌ఎల్‌బీ సీట్లను అలాట్ చేశారు. ఇప్పటికే చాలా మంది కాలేజీల్లో రిపోర్టింగ్ చేశారు.