Thursday, April 30, 2026
Home » Flood Relief Fund – ఏపీలో వరద బాధితులకు రూ.25 కోట్ల భారీ విరాళం అందించిన అదానీ గ్రూప్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

Flood Relief Fund – ఏపీలో వరద బాధితులకు రూ.25 కోట్ల భారీ విరాళం అందించిన అదానీ గ్రూప్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
Flood Relief Fund - ఏపీలో వరద బాధితులకు రూ.25 కోట్ల భారీ విరాళం అందించిన అదానీ గ్రూప్... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



మొదటి వారంలో సంభవించిన వరదలు ఏపీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. 40 మందికి పైగా మృత్యువాతపడ్డారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం. ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం రూ.25 కోట్లు అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రీతి అదానీ ప్రకటించారు.

ఈ నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25 కోట్ల విరాళం తాలూకు పత్రాలు అందించారు. చంద్రబాబు తెలిపూ… అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రీతి అదానీకి, అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వరద బీభత్సంతో కుదేలైన రాష్ట్ర ప్రజల జీవితాలను మళ్లీ నిలబెట్టడంలో మీ విరాళం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అంటూ అదానీ గ్రూప్ ను ఉద్దేశించి చంద్రబాబు ట్వీట్ చేశారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch