5
ఏపీలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు ఉన్న ప్రత్యేక కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొబైల్ మార్కెట్ల ద్వారా అన్ని రకాల ఆకుకూరలను రూ.2కు, రూ.20 లోపు ధర ఉండే కూరగాయలను రూ.5కు, రూ.20 పైన ఉండే వాటిని రూ.10 చొప్పున విక్రయిస్తామన్నారు. ఈ మేరకు 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు, కిలో కందిపప్పు, చక్కెరను ఈ కిట్ లో భాగంగా ప్రభుత్వం అందించనుంది.