3
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా లేదని డాక్టర్ చెప్పడంతో మనస్తాపం చెంది గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గూడూరు మండలం భూపతిపేటకు చెందిన బైరి మమత(29) వివాహమైన 5 ఏళ్లకు గర్భం దాల్చింది. డెలివరీ తేదీ దగ్గర పడటంతో పరీక్షించిన వైద్యులు, పిండం ఎదుగుదల సరిగా లేదని చెప్పారు. సోమవారం పురిటి నొప్పులు రావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మమత సమీప చెరువులో బుధవారం శవమై కనిపించింది.