Sunday, March 15, 2026
Home » పారాలింపిక్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు

పారాలింపిక్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు

0 comment

పారిస్‌ వేదిక కొనసాగుతోన్న పారాలింపిక్స్‌-2024 లో తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో దీప్తి కాంస్య పతకాన్ని (Bronze medal) కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో దీప్తి 55.82 సెకన్ల సమయంలో రేసును ముగించి బ్రాంజ్ మెడల్‌ను దక్కించుకుంది. తొలి పారాలింపిక్స్‌లోనే దీప్తి పతకాన్ని సాధించడం పట్ల దేశ ప్రజలకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పారాలింపిక్స్-2024లో దేశానికి పతకం సాధించి పెట్టిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch