5
రుణమాఫీ గురించి ప్రభుత్వం పై ప్రతిపక్ష BRS పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని ఆయన తెలిపారు. టెక్నీకల్ కారణం వల్ల రుణమాఫీ కానీ రైతులకు కూడా ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.గత brs ప్రభుత్వం మాటలకే పరిమితం ఐయ్యిందని ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నప్పటికీ BRS పార్టీ పని గట్టుకుని అసత్య ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు.వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి రుణమాఫీ జరగని రైతుల వివరాలు సేకరిస్తున్నారని ఆయన అన్నారు. తొందరలొనే అర్హులైన ప్రతి రైతుకు 2లక్షల రుణమాఫీ జరుగుతుందని ఆయన చెప్పారు.