Friday, April 3, 2026
Home » రంకెలు వేయడం మానుకో విదేశాంగ విధానం తెలుసుకో – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రంకెలు వేయడం మానుకో విదేశాంగ విధానం తెలుసుకో – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
రంకెలు వేయడం మానుకో విదేశాంగ విధానం తెలుసుకో - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • అవగాహన రాహిత్యంతో అవాకులు, చవాకులు పేలకు
  • రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలి
  • కేంద్రమంత్రి బండి సంజయ్ పై వెలిచాల రాజేందర్ రావు ఫైర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కేంద్ర మంత్రి బండి సంజయ్ విదేశాంగ విధానం అంటే ఏంటో తెలుసుకొని మాట్లాడాలని, సంచలనాల కోసం రంకెలు వేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు హెచ్చరించారు. బండి సంజయ్ రాహుల్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

చైనా విధానం, విదేశాంగ విధానం పై నీకు ఏమైనా పరిజ్ఞానం ఉందా? రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అసలు గాంధీ కుటుంబం గురించి నీకేం తెలుసు అని బండి సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చైనాకు మద్దతుగా నిలిచారని బండి సంజయ్ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనంగా నిలిచారు. 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? అప్పటి ప్రధానిగా వ్యవహరించిన జవహర్ లాల్ నెహ్రూ చైనాను ఎలా తిప్పి కొట్టారో తెలుసా.. ? కనీస పరిజ్ఞానం లేకుండా చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే జనంలో నవ్వుల పాలు కావడం ఖాయమని హితవు పలికారు.

ఇందిరాగాంధీ తన బాడీగార్డ్ల చేతిలో హత్యకు గురయ్యారని, అలాగే రాజీవ్ గాంధీ ఎల్ టి టి మిలిటెంట్ల చేతిలో చనిపోయారని గుర్తు చేశారు. దేశం కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన గాంధీ కుటుంబంపై అవాకులు, చవాకులు పేల్చడం మానుకోవాలని సూచించారు.

వాస్తవానికి లడ్డాక్ లోని కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించిందని పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రకటన చేసినట్లు, మీడియా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. దాడిపై చర్చిద్దామని రాహుల్ గాంధీ పట్టుబడితే మోడీ పారిపోయారని. ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. లడక్ లో కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించిందని తేల్చిన రాహుల్ గాంధీ మరి బంగ్లాదేశ్ విషయంలో రాహుల్ గాంధీ చైనాకు మద్దతుగా ఎలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. చరిత్ర తెలుసుకోకుండా కనీస పరిజ్ఞానం లేకుండా సంచలనాల కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజల్లో బండి సంజయ్ చులకన అవుతారని పేర్కొన్నారు. చైనాకు మద్దతుదారులు ఎవరో మీకు తెలవదా బండి సంజయ్ అని ప్రశ్నించారు. మద్దతుగా ఎవరు వ్యవహరిస్తున్నారో నీకు అర్థం కాలేదా అని చెప్పాలి.

బంగ్లాదేశ్ కు స్వాతంత్రం తీసుకురావడానికి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కీలకంగా వ్యవహరించాలని సూచించారు. 1971లో అప్పటి జన సంగ్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి ఇందిరాగాంధీని పార్లమెంట్ సాక్షిగా దుర్గామాత అని కీర్తించారని తెలిపారు. ఇది కూడా బండి సంజయ్ కి తెలియకపోవడం విచారకరమని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యం ఉండటం సహజమని, దేశం కోసం అన్ని పార్టీలు ఏకం కావడం చరిత్ర నిరూపించిందని దేశంలో ఈ సత్యాన్ని బండి సంజయ్ గమనించకపోవడం దారుణమని చెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారని, బలదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేందుకు తాము సమర్థిస్తామని రాహుల్ గాంధీ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రియాంక గాంధీ కూడా ఈ విషయంలో మాట్లాడరని చెప్పారు. ఇన్ని విషయాలు జరుగుతున్నా తెలుసుకోకుండానే రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనదిగా లేదని, ఆయనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయులు ఏ దేశంలో ఉన్న వారి సంక్షేమం,భద్రతా విషయంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

మోతిలాల్ నెహ్రూ ఆస్తులను పేదలకు పంచి ఇచ్చారని, స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం జైలుకు కూడా వెళ్లారని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలో జవహర్‌లాల్ నెహ్రూ కూడా జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ జాతీయతను అసలు శంకించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అసలు ఏ విషయంలో కనీస అవగాహన లేకుండానే మాట్లాడడం అలవాటుగా మారిందని, ఇది అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ కి సూచించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch