Wednesday, March 11, 2026
Home » భార్య భువనేశ్వరి కోసం చీరలు కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

భార్య భువనేశ్వరి కోసం చీరలు కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
భార్య భువనేశ్వరి కోసం చీరలు కొన్న ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ...



ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి కోసం చీరలు కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరి కోసం చేనేత చీరలను కొనుగోలు చేశారు. రెండు షాపుల్లో చీరలు కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు.. స్టాల్ నిర్వాహకులకు అక్కడికక్కడే డబ్బులు చెల్లించారు. వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. తన భార్య కోసం తొలిసారిగా చీరలు కొన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు షాపింగ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch