7
7,8 తరగతుల వరకు క్రమశిక్షణ, మంచి ప్రతిభ చూపించిన విద్యార్ధులు కూడా 9,10 తరగతులకు రాగానే ఒక్కసారిగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. బుధవారం పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్లో ఈ విషయాలు వివరించబడ్డాయి. విజయవాడలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఈ పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. విజయవాడలో విచ్చలవిడిగా లభిస్తున్న మాదకద్రవ్యాలు, మొబైల్ అడిక్షన్, ఆన్లైన్ బెట్టింగ్స్ పాఠశాల విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.