Tuesday, February 17, 2026
Home » మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ బిగిస్తున్న వచ్చు.. ఆసక్తిరేపుతున్న వ్యవహారం.! – News Watch

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ బిగిస్తున్న వచ్చు.. ఆసక్తిరేపుతున్న వ్యవహారం.! – News Watch

by News Watch
0 comment
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ బిగిస్తున్న వచ్చు.. ఆసక్తిరేపుతున్న వ్యవహారం.!


గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపారు. కానీ ఈ అరెస్టును ఇప్పటివరకు పోలీసులు ధ్రువీకరించలేదు. అదే సమయంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను అన్ని వైపుల నుంచి బిగించే ప్రయత్నం జరుగుతున్నట్లు వైసిపి నాయకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన తప్పులను ఒకవైపు ఎస్టాబ్లిష్ చేస్తూనే.. ఇతర కేసుల ద్వారా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు కీలక అనుచరులుగా ఉన్న వారిపై కేసులు నమోదు చేసి ఇప్పటికే ఆయనకు కీలక అనుచరులుగా ఉన్న పలువురుపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వంశీని కూడా ఉక్కిరిబిక్కిరి చేసేలా కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలనుంచి పోలీసులకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం వైసీపీలో ఉండగా ఆయన చేసిన తీవ్రస్థాయి వ్యాఖ్యలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి పై వంశీ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గానే తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అప్పుడే తెలుగుదేశం పార్టీ హిట్ లిస్టులో వంశీ చేరారు. ప్రభుత్వం రాగానే వంశీని కూటమిగా చేసుకొని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే సమయంలో మట్టి తవ్వకాల్లో అక్రమాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఇతరుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, భూ లావాదేవీలు వంటి వ్యవహారాల్లో వంశీ అనుచరులు చేసిన అడ్డగోలు వ్యవహారాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ఎమ్మెల్యే సీరియస్ గానే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వంశీ పై మరింత దూకుడుగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వంశీని మరిన్ని కేసుల్లో బుక్ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి

గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపికి దూరం అయిన ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీకి దగ్గర అయిన తర్వాత టిడిపి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వంశీ.. ఒకానొక దశలో వ్యక్తిగత విమర్శలకు దిగిపోయారు. ఆ తరువాత వంశీ చేసిన విమర్శలు రాష్ట్రస్థాయిలో వివాదం అయ్యాయి. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వంశీని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే అప్పుడే వంశీ తెలుగుదేశం పార్టీ హిట్ లిస్టులోకి చేరిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేతలపై సీరియస్ గానే చర్యలు తీసుకుంటామని అప్పట్లో నారా లోకేష్ కూడా చెప్పారు. అనుకున్నట్టుగానే కూటమి అధికారంలోకి రావడంతో ఈ నేతలపై నారా లోకేష్ దృష్టి సారించారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో వంశీ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వంశీని చేర్చేందుకు సిద్ధపడుతున్నారు. అన్ని వైపుల నుంచి వంశీని రౌండ చేయడం ద్వారా కోలుకోకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కోరుతోంది. మరి ఈ వ్యవహారం నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్.. ప్రకటించిన అధ్యక్షుడు సహబుద్దీన్
బంగారం కొనడానికి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు..!

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch