Monday, December 8, 2025
Home » విజయమ్మను జేసీ ప్రభాకర్‌రెడ్డి కలిసింది వైఎస్‌ జగన్‌కు చెక్‌ పెట్టేందుకేనా..? – News Watch

విజయమ్మను జేసీ ప్రభాకర్‌రెడ్డి కలిసింది వైఎస్‌ జగన్‌కు చెక్‌ పెట్టేందుకేనా..? – News Watch

by News Watch
0 comment
విజయమ్మను జేసీ ప్రభాకర్‌రెడ్డి కలిసింది వైఎస్‌ జగన్‌కు చెక్‌ పెట్టేందుకేనా..?


ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. వైఎస్‌ జగన్‌రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆయన తల్లి వైఎస్‌ విజయలక్ష్మిని కలిశారు. సోమవారం లోటస్‌పాండ్‌కు వెళ్లి విజయమ్మతో కలిసి సాయంత్రం మాట్లాడారు. సుమారు గంటపాటు లోటస్‌పాండ్‌లో గడిపిన దివాకర్‌ రెడ్డి విజయలక్ష్మితో అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు. తాజా కలయిక వెనుక కారణాలు ఏమున్నాయన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. రాజకీయాల్లో గతంతో వైఎస్‌తోనూ, ఆ తర్వాత జగన్‌తోనూ తీవ్రంగా విభేదిస్తూ జేసీ కుటుంబం. తాజాగా సార్వత్రిక ఎన్నికలు, ఫలితాలు అనంతరం కూడా వైసీపీ అభ్యర్ధి పెద్దారెడ్డితో తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అటువంటి ప్రభాకర్ రెడ్డి అకస్మాత్తుగా విజయలక్ష్మిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయలక్ష్మిని జేసీ ప్రభాకర్‌రెడ్డి కలవడం వెనుక పెద్ద రాజకీయమే ఉందంటున్నారు. జగన్మోన్‌రెడ్డితో ఇప్పటికే ఆయన సోదరి షర్మిల తీవ్రంగా విభేదించి ముందుకు సాగుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఆమె జగన్ పై చిక్కినప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్‌ విజయలక్ష్మి కూడా జగన్‌కు దూరంగానే ఉన్నారని చెప్పాలి. ఎన్నికల సమయంలో కూడా కుమారుడికి అండగా ఉండకుండా అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లి సైలెంట్‌గా ఉండకుండా తన కుమార్తెను ఎంపీగా గెలిపించాలంటూ కడప ప్రజలకు వీడియో రూపంలో సందేశాన్ని పంపారు. ఇది ఒక రకంగా వైసీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కూటమి బలం కొంత కారణమైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి పోరు కూడా ఇబ్బందులకు కారణమైందని అంటున్నారు.

ఈ కోరికనే జగన్మోహన్‌రెడ్డి కూడా తల్లి విజయలక్ష్మితో అంతంతమాత్రంగానే ఉంటున్నారన్న చర్చ సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ నేరుగా లోటస్‌పాండ్‌కు కలవడం, సుమారు గంటపాటు చర్చించడం అనేక అనుమానాలకు, చర్చలకు వెళ్లి తావిస్తోంది. విజయలక్ష్మి ఆరోగ్య విషయాలను తెలుసుకునేందుకు వెళ్లినట్లు జేసీ సన్నిహితులు చెబుతున్నా.. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉందని చెబుతున్నారు. ఈ కలయిక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కలయికపై వైసీపీ ఎలా విచారణలో ఉందన్న దానిపైనా ఆసక్తి.

ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఒలింపిక్స్ బ్రాంజ్ బ్యూటీ.. ఎవరీ మను భాకర్

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch