Sunday, March 22, 2026
Home » వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ మంత్రులు..

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ మంత్రులు..

0 comment

రామచంద్రపురం నియోజకవర్గం కే. గంగవరం మండలం కోటిపల్లి లోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. ఈ సందర్బంగా కోటిపల్లి గోదావరి ఉదృతిని, నీట మునిగిన లోదట్టు ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో సమస్యలపై ప్రజలతో చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాంతి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch