14
ప్రపంచంలో అరుదైన పక్షిగా గుర్తింపు పొందిన కలివికోడి ఆచూకీ కోసం సర్వే పునఃప్రా రంభమైంది. రెండు దశాబ్దాలకు పైగా కనిపించని ఈ ప్రాణి సిద్దవటం సమీపంలోని లంకమల అభయారణ్యంలో ఉందా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఏళ్ల తరబడి సర్వేలు చేపట్టినా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు, ఎన్టీవో సంస్థలు విడివిడిగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి సమష్టిగా సర్వేను పునఃప్రారంభించాయి.