12
పులివెందుల పునర్నిర్మాణమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని తెలుగు యువత పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రవి తేజా అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అమరావతి రాజధాని నిర్మాణమని.. అందుకు తగ్గట్లు కేంద్ర బడ్జెట్లో రూ. 15 వేలకోట్లు కేటాయించడం, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయమన్నారు.