పులివెందుల మున్సిపాలిటి పరిధిలోని గురువారం పాత బస్టాండ్, పార్నపల్లి రోడ్డు పూలంగల్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ తో ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు రోడ్డు దాటుతుంటే తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ ను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.