13
మరోవైపు ఏపీలో కోస్తా జిల్లాల్లో మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. వాయుగుండం అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ మీదుగా కొనసాగుతోంది. బెంగాల్ సముద్ర తీరంలో జూలై 26, 27 తేదీలలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఐఎండీ బుధవారం ప్రకటించింది.