తాజాగా నవీకరణ ఎప్పుడు?
2022 జులైలో వచ్చిన గోదావరి వరదలు గత 32 ఏళ్లలో భద్రాచలం ఏజెన్సీ వాసులు ఎన్నడూ చూడనివి. 1900లో 70.8 అడుగుల నీటిమట్టం భద్రాచలం వద్ద నమోదు కాగా 2022 జూలై 16న భద్రాచలం వద్ద 71.3 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఫలితంగా వంద గ్రామాలు వ్యవసాయపరంగా ప్రభావితం కాగా 78 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి ఈ వరదలతో భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, మణుగూరు, పినపాక అశ్వపురం మండలాలు అతలాకుతలమయ్యాయి. దీనికి పోలవరం వాటర్ బ్యాక్ ప్రభావమే కారణమని సాగు నీటి రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అనేక సందర్భాల్లో గుర్తించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా 2022 వరదలను ప్రాతిపదికన చేసుకొని పోలవరం బ్యాక్ వాటర్ ఎంత మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై శాస్త్రీయమైన పరిగణలోకి తీసుకోవడం ద్వారా గోదావరి వరద మాన్యువల్‌ను నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది.