రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలనీ చీకట్ల సత్యనారాయణ అన్నారు. కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారి కోటిపల్లి రేవు దగ్గర గత 35 సంవత్సరాల నుండి చీకట్ల సత్యనారాయణ కూరగాయల షాపు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల 19వ తేదీన ఒక ప్రముఖ దినపత్రిక అసత్య ప్రకటన ప్రచురించింది. ఆ ప్రకటనపై షాప్ యజమాని మాట్లాడుతూ.. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారని.. గతంలో మేము పంచాయతీకి పన్ను చెల్లించేవారుమని.. కరెంటు మీటర్ కూడా మా తాత పేరు మీద ఉందని తెలిపారు. గతంలో కోర్టు నుంచి కూడా మేము పర్మిషన్ తెచ్చుకున్నామని.. మాకు ఈ స్థలంపై పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని మంత్రి సుభాష్ గారి పై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలి..
11