
పిఆర్ సి కమిటి కి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి:
గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియామించబడే గ్రూప్ 1 పోస్టుల వేతనాలలో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని సవరిస్తూ గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండేలా ప్రభుత్వం ప్రతిపాదనలు అందించాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , హన్మంతు నాయక్ ఆధ్వర్యంలో 1 అధికారుల బృందం ఈ రోజు ఆర్ పి. సి కమీషన్ చైర్మన్ శ్రీ శివ శంకర్, సభ్యులు రామయ్య గార్లను కలిసి విజ్ఞప్తి చేశారు.
అదే విధం గా గ్రూప్ 1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు, స్టేట్ సివిల్ సర్వీస్ గా గ్రూప్ 1 సర్వీస్ లోని పోస్టులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గ్రూప్ 1 అధికారులను నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాలని పిఆర్ సి కమీషన్ ను నిర్ణయించారు.
చాలా శాఖ ల లో పదోన్నతులకు ఏళ్ల తరబడి సమయం పడుతున్నందున కాలానుగుణ ( Time Bound ) పదోన్నతులు ఇచ్చేలా చూడాలని నిర్ణయించారు.
సి పి ఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ పునరుద్దరిచేలా చూడాలని ఈ లోగా 2004 కన్నా ముందు జారీ అయిన నోటిఫికేషన్ల ద్వారా నియమితుల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో పాత పెన్షన్ ప్రక్రియ పునరుద్దరించుకోవాలని గ్రూప్ 1 అధికారుల సంఘం కోరింది.
ఈ సమావేశం లో ఈ సమావేశంలో అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్ ఇతర అధికారులు వేణు మాధవరెడ్డి, హరికిషన్, రమేష్,ప్రేం కుమార్,అనితా గ్రేస్, జయశ్రీ, వెంకన్న, విజయ్,నాగరాజు, యాదగిరి, సోమశేఖర్, యూనూస్, మైత్రి,ప్రశాంతి, పాపయ్య జరిగింది