10
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ హాల్ లో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణ, తదితర శాఖల అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ అధికారులకు సూచించారు.