Thursday, March 19, 2026
Home » ఐదు దశాబ్దాలుగా తుంగతుర్తిలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్రం గుండెపోటుతో మృతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఐదు దశాబ్దాలుగా తుంగతుర్తిలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్రం గుండెపోటుతో మృతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఐదు దశాబ్దాలుగా తుంగతుర్తిలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్రం గుండెపోటుతో మృతి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • ఉపేంద్రం మృతికి సంతాపం తెలిపిన మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
  • ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్రం భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామేల్
  • ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్రం మృతితో తుంగతుర్తిలో విషాదఛాయలు

తుంగతుర్తి ముద్ర:- సుదీర్ఘకాలం పేద ప్రజానీకానికి వైద్య సేవలు అందించి తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న ఆర్ఎంపీ వైద్యుడు పి ఉపేంద్రం శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన తుంగతుర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్ర మృతి చెందిన సంఘటన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం ఆవేదనకు గురిచేసింది. గత ఐదు దశాబ్దాలుగా తుంగతుర్తి మండల పేద ప్రజానీకానికి వైద్య సేవలు అందిస్తూ సామాజిక కార్యక్రమాల్లో తనకు తోచిన విధంగా సమాజ సేవ చేస్తూ విశేషంగా ప్రజల మన్ననలు పొందారు.

తన దగ్గరికి వచ్చే రోగులకు ఎంతమందికి వైద్య సేవలు అందించి వారికి ఎంత కాదనకుండా వైద్య సేవలు అందిస్తున్నారు.సుదీర్ఘకాలం ఆర్ఎంపీగా కొనసాగుతున్న ఉపేంద్ర వేలాది మందికి వైద్య సేవలు అందించడమే కాక తన వద్ద వైద్యం నేర్చుకునేందుకు ఎంతోమందికి ప్రాథమిక వైద్యం నేర్పి ఆర్ఎంపీలుగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఉపేంద్రానికి ఉందని చెబుతున్నారు. ఆర్ఎంపి వైద్యుడు ఉపేంద్ర మరణ వార్త తెలుసుకున్న ప్రజలు వందలాదిగా ఆయన భౌతికకాయాన్ని చివరిసారి చూడడానికి తుంగతుర్తి కి వస్తున్నారు. మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, పిసిసి సభ్యురాలు గుడిపాటి నరసయ్యలతో పాటు పలువురు మహిళా రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు విశేషంగా ప్రజానీకం ఉపేంద్ర భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. వైద్యుడు ఉపేంద్ర మృతి చెందడంతో తుంగతుర్తి పట్టణం లో ఏ మూల చూసినా విషాదఛాయలు అలుముకుంటున్నాయి సుదీర్ఘకాలం వైద్య సేవలు అందించిన ఉపేంద్రం ఇక లేరని వార్తను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch