Thursday, March 19, 2026
Home » పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర/వీపనగండ్ల:- మండల పరిధిలోని ఆయా పాఠశాలల్లో పనులను పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి త్వరితగతిన పనులు పూర్తి చేశారు జూ విద్యాశాఖ అధికారి గోవిందరాజులు. ఆదివారం మండల కేంద్రని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఆవరణలో జరుగుతున్న టాయిలెట్, వాటర్ సంపు, ఎలక్ట్రిసిటీ, మైనర్ వర్క్స్ వంటి పనులను పరిశీలించారు. మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన జిల్లా విద్యాధికారి గోవిందరాజుల ను పాఠశాలల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి గోవిందరాజులు మాట్లాడుతూ గతంలో విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యా కమిటీలు ఏర్పాటు చేయడం, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం వాటి స్థానంలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు నిర్వహించడం జరిగింది. మండల పరిధిలోని 18 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని వివరించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తిచేయాలని పాఠశాలల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్. జిల్లా సెక్టోరియల్ అధికారి యుగేందర్, యుటిఎఫ్ జిల్లా నాయకులు కృష్ణయ్య,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లలితమ్మ, సి ఆర్ పి వెంకటేష్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch