Friday, November 22, 2024
Home » ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ – News Watch

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ – News Watch

by News Watch
0 comment
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్


రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బ్రాండ్ చంద్రబాబు ఒక్కటే మార్గమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఆ బ్రాండ్ తోనే టీం చంద్రబాబు.. శక్తికి మించి పనిచేసి రాష్ట్ర ఆర్థిక రంగాన్ని, రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేశారని, దీనివల్ల రాకుండా సంక్షోభం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సరిదిద్దే పనిలో పడ్డామని, అప్పులు చేస్తూనే సొంత కాళ్లపై రాష్ట్రం నిలబడేలా చేయడమే లక్ష్యమని పయ్యావుల కేశవ్. స్థానికంగా ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.205 కోట్లు విడుదల చేస్తూ మొదటి సంతకం చేసిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇక్కడ పన్నులు భారం ఎక్కువగా ఉండడం వల్లే అక్కడ కొనగోలు సూచించినట్లు తెలిపారు. కర్ణాటకలో లారీలకు డీజిల్ పోయిస్తారని, కానీ ఆ వాహనాలు మన రాష్ట్రంలో తిరుగుతున్నాయి. మళ్ళీ పక్క రాష్ట్రంలోకి వెళ్లిన తరువాత డీజిల్ పోయించుకుంటోంది. ఇక్కడ ధరలు అధికంగా ఉండటం వల్లే రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయిందని, దీనివల్ల రాష్ట్రం నష్టపోతోందని. ఆఖరికి ఏపీఎస్ఆర్టీసీకి కూడా కర్ణాటక నుంచే డీజిల్ సరఫరా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జగన్ ప్రభుత్వంలో విప్ డీజిల్ సరఫరా చేయబడిందని, పన్నులు పెరగడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నష్టపోయాయని స్పష్టం చేశారు. వీటి నుంచి కోలుకునేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో న్యాచురల్ గ్యాస్ వినియోగంపై 26 శాతం పన్ను ఉందని, దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో భద్రత ఉంది. దీనిని తగ్గిస్తున్నట్లు మంత్రి. జగన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎంతగా బ్రష్టు పట్టిందో శ్వేతపత్రంలో వివరంగా వెల్లడిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అవసరమైన అన్ని ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి అవరోధంగా మారాయని, వీటిని పరిష్కరించుకుంటూనే రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలులోకి తెచ్చారు, ఆ దిశగానే ప్రభుత్వం వేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబునాయుడు అంకితభావంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch