Monday, February 23, 2026
Home » దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా..

దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా..

0 comment

వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట విహెచ్పిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొజ్జ జీవరత్నం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విహెచ్పిఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవాని చౌదరి పాల్గోన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు దివ్యాంగులకు ఆసరా పింఛన్ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. బ్యాక్ లాక్ ఉద్యోగాలు ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని.. వికలాంగుల చిరు వ్యాపారం కోసం ప్రభుత్వ స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch