18
మహిళలపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. కడప జిల్లా బద్వేలు లో డా.బిఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా ప్రిన్స్ పాల్ పై ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్ లో సీటు అడగడానికి వచ్చే తల్లిదండ్రులు మీద చాలా దురుసుగా అసభ్య పదజాలంతో సాటి మహిళలు అని చూడకుండా మహిళలు పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ప్రిన్స్ పాల్ దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటే భయం వేస్తుందని పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాల్సిన ప్రిన్స్ పాల్ ఇలా ప్రవర్తించడమేంటని వాపోతున్నారు. స్కూల్ పనిచేసే సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లితండ్రులు కోరుకుంటున్నారు.