పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలం, ముత్యాలమ్మ పాలెం సముద్ర తీర గ్రామంలొ N T P C & ఫార్మా కంపెనీల వ్యర్థలను శుద్ధి చెయ్యకుండా ఆవిషం కలిసిన కలుషితమైన నీటిని పైప్ లైన్స్ ద్వారా సముద్రం లోకి వదలడం వలన అతీరంలో భారీగా మత్స్య సంపద చేపలు, రొయ్యలు, పీతలు, చనిపోయి ఒడ్డుకు చేరడం జరిగింది. మత్స్య కారుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు పెందుర్తి ఇంచార్జి బంగారు రమణ, జిల్లా అధ్యక్షులు గురీ చిన్నారావు, అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు గొట్టివాడ శుభాషిణి అనకాపల్లి జిల్లా నాయకులు s.v.v రామచంద్రావు మరియు గ్రామస్తులు కలిసి పరిశీలించారు. విషపురితమైన రసయనాలు ఉప్పునీటిలో కలవడం వలన మత్స్య సంపద గుట్ట గుట్టలు గా పడివుండటం చూసి వారు విచార వ్యక్తం చేశారు. ఈ తీర ప్రాంతం లో వందలాది మత్స్యకారులు ఈ సముద్ర వేటపైనే జీవనోపాధి సాగిస్తున్నారు. అయినను దీనిపై అధికారులను చూసి చూడనట్టు వ్యవహరించారని వారు తెలిపారు. ఈ విధంగా కొనసాగితే తీర ప్రాంతలు ప్రజలు జీవనోపాధి కోల్పోయి వందలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి సమస్యను పరిష్కారం చూపుతారని, లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద బహుజన సమాజ్ పార్టీ స్థానిక మత్యాకారుల తో కలిసి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు .
పర్మా కంపెనీల విషపురితమైన రాసాయానాలకు సముద్ర మత్స్యసంపద. భారీగా భలి
11