Tuesday, March 17, 2026
Home » ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తే భాగ్యం రావడం అదృష్టం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తే భాగ్యం రావడం అదృష్టం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తే భాగ్యం రావడం అదృష్టం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • పార్టీలకు అతీతంగా సేవ చేస్తేనే నాయకునిగా గుర్తింపు
  • ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి
  • ఎంపీపీ,జడ్పీటీసీ,ఎంపీటీసీలకు సన్మానం చేసిన అధికారులు,పార్టీల నాయకులు

ముద్ర,పానుగల్ :-ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డికి, జడ్పీటీసీ లక్ష్మిశేఖర్ నాయక్ కు,వివిధ గ్రామాల ఎంపీటీసీలకు ఎంపీడీఓ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానం అందించారు. అని ఎంపీపీ,జడ్పీటీసీ,పలువురుఎంపీటీసీలు అన్నారు..

ఐదెండ్ల పదవీ కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని జీవితకాలం గుర్తుండిపోతుందని.ప్రజా ప్రతినిధులు,అధికారుల సమన్వయంతో పని చేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది.అధికారుల సన్మాన అనంతరం వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎంపీపీ,జడ్పీటీసీ,ఎంపీటీసీలను పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.అలాగే ఎంపీడీఓ పని చేస్తున్న అటెండర్ బుచ్చన్న పదవీ విరమణ పొందడంతో ఘనంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అశోక్,వ్యవసాయ అధికారి సాజిద్, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్,వెటర్నరీ డాక్టర్ శ్యామ్,ఎంపీవో రఘు రామయ్య,వివిధ గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch