ముద్ర,ఆంధ్రప్రదేశ్:-టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఈరోజు (జూన్ 5వ తేదీ) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్డీయే సమావేశంలో ఈ నేతలు పాల్గొంటారు.మద్దతుపై లాంఛనంగా తీర్మానం చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి బీజేపీ పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు సమాచారం.మరోవైపు ఫలితాలు వెల్లడైన తర్వాత మంగళవారం రోజున చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంటకుపైగా ఇద్దరి మధ్య చర్చలు సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చర్చించినట్లు సమాచారం.
ఎన్డీయే సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. నేతలు మాట్లాడుకున్నట్లు ఈ క్ర మంలో పిఠాపురం ప్రజలందరికీ పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కదం తొక్కిన జనసైనికులకు పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలు ఆకాశమంత విజయం సాధించారని.. దాన్ని గుండెల్లో పెట్టుకుంటామని అన్నారు. గెలుపు తనకు బాధ్యతనిచ్చిందని.. అహంకారాన్ని కాదని పవన్ కల్యాణ్ తెలిపాడు.