Tuesday, March 17, 2026
Home » మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, ఆదిలాబాద్:ఆదిలాబాద్ మాజీ ఎంపీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ రమేష్ శనివారం 12.49 గంటలకు మృతి చెందారు. శుక్రవారం ఆయనకు రక్తపోటు పడిపోవడంతో ఆదిలాబాద్ రిమ్స్ కు. అనంతరం గజానంద్ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించి హైదరాబాద్ కు తరలిస్తున్న సమయంలో వాహనంలోనే మృతి చెందారు. 57ఏళ్ల రమేష్ రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన లంబాడీ సామాజిక వర్గ నేత. తెలుగు దేశం పార్టీ పక్షాన నార్నూర్ జడ్పీటీసీగా రాజకీయ రంగంలో అరంగేట్రం చేశారు. ఖానాపూర్ శాసన సభ నియోజక వర్గం నుండి శాసన సభ్యుడిగా1999-2004 మధ్య కాలంలో పని చేశారు.

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా 2006-2009 మధ్య కాలంలో పని చేశారు.ఆదిలాబాద్ లోకసభ నియోజక వర్గం నుండి 2009-2014లో 15వ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత టీ ఆర్ ఎస్ లో చేరారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లో కొనసాగుతున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021లో బిజెపి లో చేరారు. 2023లో ఖానాపూర్ ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓటమి చవి చూశారు. రాథోడ్ రమేష్ కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch